న్యూఢిల్లీ, మార్చి 13: ఈ నెల 31కల్లా ఇన్వెస్టర్లు వారి డీమ్యాట్ ఖాతాకు నామినీని యాడ్ చేయడం తప్పనిసరి. లేదంటే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. వాస్తవానికి ఈ గడువు 2022 మార్చితో ముగియగా, పలు వర్గాల నుంచి వినతుల మేరకు 2023 మార్చి 31 వరకూ నామినేషన్ గడువు పొడిగించింది. డీమ్యాట్ ఖాతాకు గరిష్ఠంగా ముగ్గుర్ని నామినేట్ చేయవచ్చు. తల్లి, తండ్రి, సోదరుడు, అక్కాచెల్లెళ్లు, కొడుకు కూతళ్లు, ఇతర వ్యక్తులు..ఎవరినైనా నామినీగా యాడ్ చేయవచ్చు. మైనర్ అయితే సంరక్షుడి వివరాలు ఇవ్వాలి.