న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : దేశంలో స్మార్ట్‌వాచీలకు గిరాకీ తగ్గిపోయింది. గత ఏడాది భారత్‌కు వాటి సరఫరా 30 శాతం పడిపోయింది మరి. వినియోగదారులకు సంతృప్తికర అనుభవం లేకపోవడం, కొరవడిన కొత్తదనం తదితర కారణాలే ఇందుకు కారణమని సోమవారం కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ నివేదిక తెలిపింది. ఇది ఫైర్ బోల్ట్, బోట్, నాయిస్ కంపెనీలకు ఎదురుదెబ్బగా పేర్కొన్నది. ఫైర్ బోల్ట్ దిగుమతులు 54 శాతం పడిపోగా, బోట్ 47 శాతం, నాయిస్ 26 శాతం దిగజారాయి. నిరుడు దేశీయ స్మార్ట్‌వాచీ మార్కెట్లో నాయిస్ వాటా 27 శాతంగా ఉంటే, ఫైర్ బోల్ట్ 19 శాతం, బోట్ 13 శాతంగానే ఉన్నా యి. 2023లో ఫైర్ బోల్ట్ వాటా 30 శాతంగా, బోట్ వాటా 17 శాతంగా ఉండ టం గమనార్హం. అయితే 2024లో టైటాన్‌కు చెందిన ఫాస్ట్‌ట్రాక్ స్మార్ట్‌వాచీల సరఫరా దేశీయ మార్కెట్లో 35 శాతం పెరగడం విశేషం. అలాగే రూ.20 వేలకుపైగా ధర కలిగిన స్మార్ట్‌వాచీలకూ మార్కెట్లో డిమాండ్ పెరిగిందని కౌంటర్‌పాయింట్ చెప్పింది.