నూఢిల్లీ, జూన్ 20: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదుటపడటంతో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్‌కు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కో-వర్కింగ్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ రెండింతలు పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల్లో ఈ డిమాండ్ రెండురెట్లు పెరిగి 90 వేల డెస్క్‌లు లీజుకు తీసుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. కరోనా సెకండ్‌వేవ్ తర్వాత ఆఫీస్ స్పేస్‌కు అధికంగా డిమాండ్ పెరిగిందని జేఎల్ఎల్ ఇండియా, డెస్క్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. 2020-21లో మాత్రం 37,300 సీట్లు మాత్రమే లీజుకు తీసుకున్నారు. ‘ఇండియా ఆఫీస్ మార్కెట్ రికాలిబ్రేటింగ్ విథ్ ఫ్లెక్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో కో-వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ కొనసాగుతున్నదని, అటు కార్పొరేట్లు, చిన్న స్థాయి సంస్థలు ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకోలేక కేవలం లీజుకు తీసుకొని తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. స్వల్పకాలంపాటు ఒక్కచోట డెస్క్‌ను లీజుకు తీసుకునే సంస్థలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలకాలంలో స్టార్టప్‌లు మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయడం కూడా పరోక్షంగా దోహదం చేస్తున్నాయి.
300 సీట్ల కంటే ఎక్కువే..
గడిచిన ఆర్థిక సంవత్సరంలో లీజుకు తీసుకునే సీట్ల సంఖ్య గరిష్ఠ స్థాయిలోనే ఉన్నది. 300 సీట్ల కంటే అధికంగా ఉన్న ఆఫీస్ స్పేస్‌కు అత్యధికంగా లీజ్‌కు తీసుకున్నట్లు జేఎల్ఎల్ పేర్కొంది. మొత్తం సీట్ల లీజు వాటా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్లదే అగ్రస్థానమని, మొత్తం వాటాలో ఈ నగరాల్ల వాటా 60 శాతానికి పైగా ఉంటుందని పేర్కొంది. అలాగే ఒక్కో డెస్క్‌కు రూ.6,300 నుంచి రూ.14,300 వరకు చార్జీ చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ వంటి మెట్నో నగరాల్లో ప్రీమియం ఫ్లెక్స్ సెంట్రర్లలో ఒక్కో డెస్క్ కోసం 50 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇది రూ.4 వేల నుంచి రూ.6,800 వరకు ఉన్నది. ప్రస్తుతం ఈ ఏడు నగరాల్లో 2,300 ఫ్లెక్స్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్ల నిర్వహణలో బెంగళూరు మొదటి స్థానంలో ఉన్నది. ఆ తర్వాతి జాబితాలో ముంబై, ఢిల్లీ, పుణెలు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలైన కాన్పూర్, గోవా, రాయ్‌పూర్, భోపాల్, వైజాగ్, కొచి, పాట్నా, లఖ్నో, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్‌లలో 650 కో-వర్కింగ్ సెంటర్లు ఉన్నాయ.