న్యూఢిల్లీ, జూలై 15: నూతన సెల్టోస్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని కియా ఇండియా ప్రకటించింది. విడుదల చేసిన తొలిరోజే 13 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది. ఈ నూతన సెల్టోస్ మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్ మరింత బలోపేతం కావడానికి దోహదం చేయనున్నదని, అత్యాధునిక ఫీచర్స్, ఇండస్ట్రీలో నూతన మైలురాయికి చేరుకుంటున్నదని ఆశిస్తున్నట్లు కియా ఇండియా ఎండీ, సీఈవో తా-జిన్ పార్క్ తెలిపారు.