భారత్‌లో పసిడి కాంతులు

- దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్
- జనవరి-మార్చిలో 140 టన్నులకు చేరిక
- ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక
ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరిగి 140 టన్నులకు చేరింది. గతేడాది జనవరి-మార్చిలో 102 టన్నులకే డిమాండ్ కనిపించింది. కరోనా సంబంధిత ఆంక్షలు తొలగిపోవడం, ధరలు దిగిరావడంతో పసిడికి ఆదరణ పెరిగినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తమ తాజా నివేదికలో తెలిపింది. విలువపరంగా 57 శాతం పెరుగగా, నిరుడుతో చూస్తే రూ.37,580 కోట్ల నుంచి 58,800 కోట్లకు ఎగిసింది. ఆభరణాల డిమాండ్ 39 శాతం ఎగబాకి 73.9 టన్నుల నుంచి 102.5 టన్నులను తాకింది. విలువలో 58 శాతం వృద్ధి చోటుచేసుకోగా, రూ.27,230 కోట్ల నుంచి 43,100 కోట్లకు చేరింది.
క్షీణించిన గ్లోబల్ డిమాండ్
భారత్‌లో పసిడికి ఆదరణ కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా మాత్రం 23 శాతం తగ్గింది. ఈ జనవరి-మార్చిలో 815.7 టన్నులకే పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 1,059.9 టన్నులకు డిమాండ్ వ్యక్తమైంది. పెట్టుబడులు కూడా 71 శాతం దిగజారాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఉపసంహరణలు జరిగాయి. అయితే బంగారం కడ్డీలు, నాణేలపై పెట్టుబడులు మాత్రం 36 శాతం పెరిగినట్లు డబ్ల్యూజీసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
డబ్ల్యూజీసీ నివేదిక ముఖ్యాంశాలు
- ఈ ఏడాది జనవరి-మార్చిలో బంగారంపై పెట్టుబడులకున్న డిమాండ్ 34 శాతం పెరిగింది. గతేడాదితో పోల్చితే 28.1 టన్నుల నుంచి 37.5 టన్నులకు చేరింది. విలువపరంగా 53 శాతం ఎగబాకగా, రూ.10,350 కోట్ల నుంచి 15,780 కోట్లకు ఎగిసింది.
- దేశంలో మొత్తం రీసైకిల్డ్ గోల్డ్ 20 శాతం పడిపోయింది. నిరుడు జనవరి-మార్చిలో 18.5 టన్నులుగా ఉంటే, ఈసారి 14.8 టన్నులకు పరిమితమైంది.
- దేశీయ నికర బులియన్ దిగుమతులు ఈ జనవరి-మార్చిలో 301 టన్నులకు ఎగిశాయి. నిరుడు ఇదే వ్యవధిలో 83.1 టన్నులుగానే ఉన్నాయి.
- కలిసొచ్చిన బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గింపు.
- పెరుగుతున్న కరోనా ఉద్ధృతి లాక్డౌన్లకు దారితీస్తే.. శుభకార్యాలు నిలిచి బంగారం కొనుగోళ్లు ప్రభావితం కావచ్చు.
- ఈ జనవరి-మార్చిలో 18.7 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన రిజర్వ్ బ్యాంక్
‘దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.47వేలకు దిగివచ్చింది. ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం నుంచి కోలుకోవడం, పెండ్లిండ్ల సీజన్ కూడా తోడవడం కొనుగోళ్లను పెంచింది. ముఖ్యంగా నిరుడు ఆగస్టులో గరిష్ఠంగా రూ.56,000 పలికింది. ఈ క్రమంలోనే రూ.50వేల మార్కు దిగువకు చేరడంతో డిమాండ్ ఊపందుకున్నది’
- సోమసుందరం, డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Global Demand
- gold
- India
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

