GST on Swiggi & Zomato | ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆయా ఫుడ్ ఐటమ్స్‌ను బట్టి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వడ్డించనున్నది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ.. లక్షల మందికి సకాలంలో ఫుడ్ డెలివరీ చేశాయి.
ఇంతకుముందు వరకు జొమాటో, స్విగ్గీలకు ఆర్డర్లపై ఫుడ్ డెలివరీ చేసే హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేసేది. కానీ వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్న జొమాటో, స్విగ్గీలపై జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.