NSE Co-Location Scam | చిత్రకు 7 రోజుల సీబీఐ కస్టడీ.. యోగి గుర్తింపునకు నో!
NSE Co-Location Scam | ఎన్ఎస్ఈ మాజీ సీఈవో కం ఎండీ చిత్ర రామకృష్ణకు సీబీఐ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది.
NSE Co-Location Scam | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ కం సీఈవో చిత్ర రామకృష్ణకు ఢిల్లీలోని సీబీఐ కోర్టు ఏడు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కాం, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్ర రామకృష్ణను విచారించేందుకు 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి సంజీవ్ అగర్వాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థించింది.
చిత్ర రామకృష్ణ శనివారం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జడ్జి సంజీవ్ అగర్వాల్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు రోజులు విచారించిన తర్వాత ఆదివారం చిత్రను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. అదృశ్య యోగిగా అనుమానిస్తున్న ఆనంద్ సుబ్రమణ్యన్‌ను గుర్తించడానికి చిత్ర రామకృష్ణ నిరాకరించడం గమనార్హం.
ఇదే కేసులో ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ కం ఎండీ సలహాదారు ఆనంద్ సుబ్రమణ్యన్‌ను కూడా న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. చెన్నైలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐటీ శాఖ అధికారులు ఇంతకుముందు చిత్ర రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యన్ నివాసాల్లో సోదాలు చేసి, కీలక ఆధారాలు గల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై సెబీ కూడా దర్యాప్తు చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

