D-Mart | డీ-మార్ట్ రిటైల్ చైన్ నెట్వర్క్ సీఈఓగా అన్షుల్ అసవాను నియమిస్తున్నట్లు ఆ సంస్థ మాతృసంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ తెలిపింది. ప్రస్తుత సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ నెవిలే నోరూన్హం వచ్చే ఏడాది జనవరిలో వైదొలుగుతారు. ఈ నేపథ్యంలో ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ తన డీ-మార్ట్ టాప్ మేనేజ్మెంట్ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. కొత్త సీఈఓగా నియమితులైన అన్షుల్ అసవా ఇప్పటి వరకూ యూనీ లివర్ థాయిలాండ్ కంట్రీ హెడ్‌గానూ, గ్రేటర్ ఆసియాలో హోంకేర్ బిజినెస్ యూనిట్ జనరల్ మేనేజర్‌గా ఉన్నారు.
ప్రస్తుత సీఈఓ నెవిలీ నొరోన్హమ్ తన సర్వీసు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోలేదని ఎవెన్యూ సూపర్ మార్ట్స్ తెలిపింది. డీ-మార్ట్ విస్తరణకు ఆయన అసాధారణ సేవలను కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ప్రశంసించారు. కొత్తగా నియమితులైన అన్షుల్ అసవా బాధ్యతలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత సీఈఓ నొరోన్హా రెండు దశాబ్దాలుగా డీ-మార్ట్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఐదు స్టోర్ల నుంచి 380కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు అన్షుల్ అసవాకు ప్రస్తుత సీఈఓ నెవిల్లే నోరోన్హా పూర్తిగా సహకరిస్తారు.