సైయంట్ చేతికి పోర్చుగల్ కంపెనీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ సైయంట్ తాజాగా పోర్చుగల్‌కు చెందిన వైర్లెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ సెల్ఫీనెట్ను చేజిక్కిచుకుంటున్నది.
- రూ.340 కోట్లకు కొనుగోలు
న్యూఢిల్లీ, జూన్ 6: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ సైయంట్ తాజాగా పోర్చుగల్‌కు చెందిన వైర్లెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ సెల్ఫీనెట్ను చేజిక్కిచుకుంటున్నది. 41 మిలియన్ యూరోలతో (దాదాపు రూ.340 కోట్లు) కొనుగోలు చేయనున్నట్టు సోమవారం సైయంట్ తెలిపింది. పూర్తి నగదు రూపంలో జరగనున్న ఈ లావాదేవీలో తొలుత 65 శాతం సైయంట్ చెల్లిస్తుంది. మిగిలిన 35 శాతం రెండేండ్లలో ఆర్జించే ఆదాయం నుంచి చెల్లిస్తారు. 5జీ రోల్అవుట్స్ కోసం వైర్లెస్ నెట్వర్క్స్ విభాగంలో తమ టెక్నాలజీని పటిష్టపర్చడానికి సెల్ఫీనెట్కు ఉన్న నైపుణ్యం, దీర్ఘకాలిక కస్టమర్ రిలేషన్షిప్స్ దోహదపడతాయని సైయంట్ ఎండీ, సీఈవో కృష్ణ బోడనపు తెలిపారు. అలాగే యూరప్‌లో సైయంట్ ఉనికిని ఇది మరింత పెంచుతుందని, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాల్లో వ్యాపారాన్ని అధికంచేసుకునేందుకు సహకరిస్తుందని వివరించారు. జూన్ 20 కల్లా ఈ డీల్ ముగుస్తుందని అంచనా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

