Fiscal Deficit | తొలి మూడు నెలల్లోనే భారీగా పెరిగిన ద్రవ్యలోటు.. వడ్డీలకే 2.43 లక్షల కోట్లు ఖర్చుచేసిన కేంద్రం
Fiscal Deficit | సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వేగంగా పెరిగే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే భారీగా నమోదయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో ఈ ఏప్రిల్-జూన్‌లోనే ఇది 25.3 శాతానికి చేరుకుంది.
Fiscal Deficit | న్యూఢిల్లీ, జూలై 31: సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వేగంగా పెరిగే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే భారీగా నమోదయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో ఈ ఏప్రిల్-జూన్‌లోనే ఇది 25.3 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదేకాలంలో ఇది బడ్జెట్ లక్ష్యంలో 21.2 శాతమే ఉంది. ద్రవ్యలోటు జూన్ చివరినాటికి రూ.4,51,370 కోట్లకు చేరినట్టు సోమవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివరాలు..
- ఈ తొలి మూడు నెలల్లో నికర పన్నుల ఆదాయం రూ.4,33,620 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ.10.5 లక్షల కోట్లకు పెరిగింది. వ్యయం 2022-23 ఏప్రిల్-జూన్‌లో నమోదైన రూ.9.48 కోట్లను ఈ దఫా మించింది.
- పూర్తి ఏడాదికి బడ్జెట్ అంచనాల్లో నిర్దేశించిన నికర పన్నుల ఆదాయంలో జూన్ చివరినాటికి 18.6 శాతం రాగా, మొత్తం వ్యయం 23.3 శాతానికి పెరిగింది.
- దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ.17.87 లక్షల కోట్ల ద్రవ్యలోటులో 25.3 శాతానికి తొలి త్రైమాసికంలోనే చేరుకుంది.
- గత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలోనే రూ.5.1 లక్షల కోట్ల పన్నుల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అది గణనీయంగా తగ్గింది.
- 2023-24 ఆర్థిక సంత్సరంలో ద్రవ్యలోటు 5.9 శాతానికి తగ్గిస్తామంటూ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం ద్రవ్యలోటు నమోదయ్యింది.
వడ్డీలకే 2.43 లక్షల కోట్లు
ముగిసిన మూడు నెలల కాలంలో మొత్తం రూ.10.5 లక్షల కోట్ల వ్యయంలో రూ.7.72 లక్షల కోట్లు రెవిన్యూ వ్యయం కాగా, రూ.2.78 లక్షల కోట్లు మూలధన వ్యయంగా సీజీఏ వెల్లడించింది. మొత్తం రెవిన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులకే కేంద్ర ప్రభుత్వం రూ. 2,43,705 కోట్లు ఖర్చుచేసింది. రూ.87,035 కోట్లు సబ్సిడీల కోసం వెచ్చించింది. ప్రభుత్వ వ్యయం, ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. ద్రవ్యలోటు పెరిగితే ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

