
హైదరాబాద్, అక్టోబర్ 6: హెల్త్, ఫిట్నెస్ సేవలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థలో ఒకటైన కట్.ఫిట్.. తెలంగాణలో తన వ్యాపారాన్ని మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్లో సేవలు అందిస్తున్న సంస్థ.. తాజాగా ఫ్రాంచైజ్ పద్దతిన చిన్న నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది. ఈ ఏడాది చివరినాటికి 50 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను వేగవంతం చేసి నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.