హైదరాబాద్, జూలై 5: క్రాంప్టన్ హైదరాబాద్లో ఒకేసారి మూడు ‘క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియో’లను ప్రారంభించింది. ఈ స్టూడియోను ప్రారంభించిన ఐదో నగరంగా భాగ్యనగరం కావడం విశేషం.
ఈ స్టూడియోలో పలు కంపెనీలకు సంబంధించిన 38 రకాల ప్రీమియం ఉత్పత్తులను ప్రదర్శించనున్నది. వినియోగదారులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో ఒకేసారి ఈ మూడు స్టూడియోలను ఆరంభించినట్లు, వచ్చే వారంలో మరో స్టూడియోను ప్రారంభించనున్నట్లు కంపెనీ వీపీ నీతేష్ మాథుర్ తెలిపారు.