హైదరాబాద్, ఆగస్టు 2: అంతర్జాతీయ డిజిటల్, టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల సంస్థ క్రిటికల్‌రివర్.. హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఆరంభించింది. భారత్‌లో సంస్థకు ఇది మూడో సెంటర్ కావడం విశేషం. ఈ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భావితరాలకు టెక్నాలజీ పరంగా నూతన సేవలు అందించేదానిపై క్రిటికల్‌రివర్ చాలా కృషి చేస్తున్నదని, ఈ డిజిటల్ సెంటర్‌తో ముఖ్యంగా హైదరాబాద్‌లో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కస్టమర్లకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ నుంచి సేవలు అందించనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో అంజి మారం తెలిపారు. భవిష్యత్తులో భారత్‌లో ఉన్న మూడు డిజిటల్ సెంటర్ల కంటే ఇదే అతిపెద్ద సెంటర్ కాగలదన్న విశ్వసాన్ని ఆయన వ్యక్తంచేశారు. 70 శాతం మంది ఉద్యోగులు ఇక్కడి నుంచే పనిచేస్తారని చెప్పారు. 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను వచ్చే ఐదేండ్లలో రెండు రెట్లు పెంచేయోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించాయి.
ముఖ్యాంశాలు