శంషాబాద్ రూరల్, జూలై 2: నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లేందుకు యత్నించిన 20 మంది మహిళలను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 20 మంది మహిళలు ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
ఇమిగ్రేషన్ అధికారులు వారి వద్ద ఉన్న వీసాలను పరిశీలించగా, అవి నకిలీవని గుర్తించారు. వారిని ఆదుపులోకి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. నకిలీ వీసాలు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తే ఏజెంట్ ద్వారా తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంటు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.