Credit Card | క్రెడిట్ కార్డులు.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డు యూజర్లు రోజురోజుకు పెరుగుతున్నారు. మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ వచ్చాక మరింత పెరిగింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దెల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇదే గత నెలలో క్రెడిట్ కార్డుల వాడకం తగ్గిపోవడానికి కారణమైంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే రెంట్ (ఇంటి అద్దె) చెల్లింపులపై చార్జీ వసూలు చేస్తున్నాయి బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ జారీ సంస్థలు. గతేడాది ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల వాడకం 45.50 శాతం వృద్ధి చెందితే, ఈ ఏడాది దాదాపు 38 శాతానికే సరిపెట్టుకున్నది. గత జనవరితో పోలిస్తే ఏడు శాతం వాడకం తగ్గింది.
గత జనవరిలో క్రెడిట్ కార్డుల జారీ 0.91 శాతం పెరిగితే, వాడకం ఏడు శాతం తగ్గిపోయింది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డ్ వాడకం ఏడాది ప్రాతిపదికన 8.1 శాతం, నెలవారీ ప్రాతిపదికన నాలుగు శాతం క్రెడిట్ కార్డుల వాడకం పడిపోయింది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే మొత్తం క్రెడిట్ కార్డుల జారీ 1.11 శాతం పెరిగింది కానీ వాడకం రెండు శాతం పతనమైంది.
గతేడాది ఫిబ్రవరిలో 73 శాతానికి పైగా క్రెడిట్ కార్డులు జారీ అయితే, ఈ ఏడాది 68 శాతంతోనే సరిపెట్టుకున్నాయి క్రెడిట్ కార్డు జారీ సంస్థలు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మార్కెట్ వాటా కోల్పోయాయి. అత్యధిక క్రెడిట్ కార్డులు జారీ చేసిన నాలుగు సంస్థల్లో ఎస్బీఐ మాత్రమే టాప్లో నిలిచింది. క్రెడిట్ కార్డుల వాడకం గతేడాది ఫిబ్రవరిలో 73.75 శాతం టాప్ సంస్థలు నిలిస్తే, ఈ ఏడాది వాటి వాటా 72 శాతంతో సరిపెట్టుకున్నాయి.