Forex Reserve | దేశీయ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మార్చి 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు రూ.2.95 బిలియన్ డాలర్లు పెరిగి రూ.645.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం గరిష్టం. ఇంతకు ముందు వారం (మార్చి 22) లో 140 మిలియన్ డాలర్లు పెరిగి 642.63 బిలియన్ల డాలర్లకు చేరాయి ఫారెక్స్ రిజర్వు నిల్వలు. వరుసగా ఆరు వారాలుగా ఫారెక్స్ రిజర్వు నిల్వలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 642.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
మార్చి 29తో ముగిసిన వారానికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ 2.35 బిలియన్ డాలర్లు పెరిగి, 570.618 బిలియన్ డాలర్లకు పెరిగాయి. బంగారం రిజర్వు నిల్వలు 673 మిలియన్ డాలర్లు పెరిగి 52.16 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 73 మిలియన్ డాలర్లు తగ్గి 18.145 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు ఐఎంఎఫ్‌లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు రెండు మిలియన్ డాలర్లు తగ్గి, 4.65 బిలియన్ డాలర్లకు పెరిగాయి.