నగరానికి చెందిన స్టార్టప్‌ను అమెరికాకు చెందిన నోషన్ కంపెనీ కొనుగోలు చేయడంతో పాటు ఆ కంపెనీ అమెరికా తర్వాత హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ ఆటోమెట్ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. విజయవంతమైన స్టార్టప్ తీర్చిదిద్దిన ఆటోమేట్ స్టార్టప్ నిర్వాహకుల్లో ఒకరైన అశోక్ గుడిబండ్లతో పాటు అతని బృందం పనితీరును ప్రశంసించారు. స్టార్టప్‌ను కొనుగోలు చేసి, నగరంలో అతి పెద్ద ఇంజనీరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన నోషన్ కంపెనీకి స్వాగతం పలికారు.