న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: అమెరికాకు చెందిన డిజిటల్ బ్యాంకింగ్ సేవల సంస్థ కాండ్సెంట్.. హైదరాబాద్‌లో మరో టెక్నాలజీ సెంటర్‌ను గురువారం ప్రారంభించింది. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్‌ను రహేజా మైండ్‌స్పేస్ ఐటీ పార్క్‌లో నెలకొల్పింది.
300 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ సెంటర్ సంస్థకు ఇది రెండోదని కంపెనీ సీవోవో జాన్ గార్వీ తెలిపారు. ఈ రెండు సెంటర్లలో మొత్తంగా 530 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం సంస్థకు ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో సెంటర్లు ఉండగా, వీటిలో 2 వేల వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు.