Company Secretaries | హైదరాబాద్, మార్చి 30: భారత్లో కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, 2047 నాటికి కొత్తగా 2 లక్షల మంది అవసరమవుతారని ఐసీఎస్ఐ జాతీయ ప్రెసిడెంట్ బీ నరసింహన్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 వేల మంది కంపెనీ సెక్రటరీలు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఐసీఎస్ఐ నుంచి ప్రతియేటా 14 వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ సంఖ్యను ఈ ఏడాది రెండింతలు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు.