Gold Loan | ప్రతి ఒక్కరూ తమ ఆదాయం లోపే ఇంటి ఖర్చులు చేస్తుంటారు. అటువంటప్పుడే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్లు సంకేతం. కానీ.. ఎమర్జెన్సీ ఖర్చులు మనకు చెప్పి రావు.. అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వెసులుబాటు ఉంటే ఎమర్జెన్సీ ఫండ్ ముందే ఏర్పాటు చేసుకోవాలి. కానీ అందరికీ అలా సాధ్యం కాదు. ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలు తలెత్తినా.. పిల్లల విద్యావసరాలకు అప్పటికప్పుడు భారీ మొత్తంలో డబ్బు అవసరమైనా , మీరు చేసే వ్యాపారానికి అదనంగా పెట్టుబడి అవసరమైనా.. తక్షణం డబ్బు దొరకదు. ఇటువంటి పరిస్థితుల్లో లోన్ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్దకు పరుగులు తీయాల్సిందే. అలా వెళ్లి దరఖాస్తు చేసినా సకాలంలో మంజూరు కావు. ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది. కనుక అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అవసరాలకు అందుబాటులో ఉండేదే బంగారంపై రుణం.
అనాది నుంచి భారతీయులకు, ప్రత్యేకించి భారతీయ మహిళలకు బంగారం అంటే ప్రీతి ఎక్కువే. కనుక ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఎమర్జెన్సీ అవసరాల్లో ఆ బంగారమే కొండంత అండగా నిలుస్తుంది. దాన్ని తాకట్టు పెట్లి లోన్ తీసుకోవడం చాలా తేలిక. వేగంగా కూడా బంగారంపై రుణం లభించే చాన్స్ ఉంది. ఇది పూర్తిగా సెక్యూర్డ్ లోన్ కనుక బ్యాంకులు కూడా ఎలాంటి ఆటంకాలు చెప్పకుండానే చకచకా లోన్ మంజూరు చేస్తాయి.
ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. అంటే ఇప్పుడంతా డిజిటల్ యుగం కదా.. ఆన్లైన్ లో కసరత్తు పూర్తి చేస్తే.. ఫిజికల్‌గా బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఆన్ లైన్లో బంగారం తాకట్టు పెట్టడానికి ఒక ఫామ్ నింపితే సరి.. సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల అధికారులు, ప్రతినిధులు ఇంటికి వచ్చి బంగారం చెక్ చేసుకుంటారు. క్వాలిటీ చెక్ చేసుకుని, సంబంధిత రుణ గ్రహీత నుంచి అవసరమైన పత్రాలు తీసుకుని వెళతారు. కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రయి పూర్తవుతుంది.
బంగారం విలువను బట్టి రుణం మంజూరు అవుతుంది. ఒకవేళ అననుకూల పరిస్థితుల్లో ఎవరైనా రుణం ఎగవేతకు పాల్పడతే తాకట్టు పెట్టిన పుత్తడి వేలం వేసి లోన్ రికవరీ చేసుకోవడానికి వీలు చిక్కుతుంది. బంగారంపై లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులు సంబంధిత వ్యక్తి సిబిల్ స్కోర్ పరిగణనలోకి తీసుకోవు.
పర్సనల్ లోన్, తాకట్టు లేదా బిజినెస్, కార్పొరేట్ రుణాలతో పోలిస్తే బంగారంపై తీసుకునే లోన్లకు వడ్డీ తక్కువ. ఎమర్జెన్సీలో తక్కువ వడ్డీపై రుణం పొందే వెసులుబాటు ఉండటం సానుకూలలమే.. సంబంధిత వ్యక్తి రోజువారీ ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపదు. బంగారం తాకట్టుపై రుణం చెల్లింపు వాయిదాలు కూడా తక్కువే ఉంటాయి. ఇవన్నీ రుణ గ్రహీతకు వెసులుబాటే.
ఇక వైద్య ఖర్చులు, బిజినెస్ వంటి అవసరాలకు భారీగా డబ్బు అవసరరం కావచ్చు. ఎక్కువ టైం కూడా ఉండని సందర్భాలు వస్తాయి. అటువంటప్పపుడు ఆదుకునేది బంగారరంపై తాకట్టు రుణాలే. మిగతా లోన్లతో పోలిస్తే బంగారం లోన్ మేలని ఆర్థిక వేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్బీఐ రూల్స్ ప్రకారం బంగారం మార్కెట్ విలువలో 75 శాతం వరకూ లోన్ పొందొచ్చు.. రూ.30 లక్షల విలువ గల బంగారంపై రూ…21 లక్షల రుణం లభిస్తుంది..
బంగారం లోన్ తీసుకున్న వారు నెల వారీగా వడ్డీ, చివర్లో అసలు చెల్లించొచ్చు. కనుక గోల్డ్ లోన్ ఫ్లక్సిబుల్గా ఉంంటుంది. కుటుంబ అవసరాలను బట్టి.. ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా గోల్డ్ లోన్ చెల్లించొచ్చు. అప్పుడు ఆర్థిక, మానసిక పరమైన ఒత్తిళ్లు ఉండవు. బంగారం తాకట్టుపై తీసుకునే రుణం మన అవసరాలను బట్టి వాడుకునే వీలు ఉంటుందని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.