ఉప్పల్, ఆగస్టు 8 : పండుగ ఏదైనా, శుభకార్యం ఎలాంటిదైన ప్రతి ఉత్పత్తి అనుకూల ధరల్లో అందుబాటులో లభించే ఒకే ఒక వస్ర్తాలయం సీఎంఆర్ షాపింగ్‌మాల్. కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా, విభాగాల వారీగా లభించే వస్ర్తాలయం. మహిళలకు, కిడ్స్‌కు ప్రత్యేక ఆకర్షణీయమైన నూతన డిజైన్లు, దివ్యాంగులకు, మహిళలకు ప్రత్యేకమైన కేర్టెకింగ్ సౌకర్యాలు, శిక్షణ పొందిన సిబ్బంది, కస్టమర్లకు సమయం కలిసివచ్చే వ్యాపార కేంద్రంగా సీఎంఆర్ షాపింగ్‌మాల్ నిలుస్తుంది.
సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను వ్యవస్థాపకుడు చంద్రమోహన్ సారథ్యంలో రాజమండ్రిలో ప్రారంభించారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల్లో 40కి పైగా బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి, కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు. వందకు పైగా బ్రాంచ్‌ల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాబోయే 6 నెలల్లో 10 బ్రాంచ్‌లను ప్రారంభించనున్నారు. శ్రావణ మాసంలో 61 శాతం డిస్కౌంట్‌తో ఇవ్వనున్నారు.
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో 5 యూనిట్లతో ఆధునిక వస్ర్త, వ్యాపారం సంస్థలు నిర్వహిస్తున్నారు. సీఎంఆర్ షాపింగ్‌మాల్, సీఎంఆర్ సెంట్రల్, సీఎంఆర్ జ్యువెల్లరీ, కంచికామాక్షి, మావూరి సిల్క్స్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు మావురి వెంకటరమణ, మావురి మోహన్బాలాజీ సారథ్యంలో సీఎంఆర్ సేవలను కొనసాగిస్తున్నారు.
జ్యువెల్లరీ, కాస్మొటిక్స్, డ్రెస్సింగ్ మెటీరియల్, చీరలు, జనరల్, ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్, పట్టు వస్ర్తాలు, చుడీదార్, గాగ్రా, వెస్టర్న్, ఇండియన్, తదితర వెరైటీలు మెన్స్, కిడ్స్‌కు అందుబాటులో ఉంచారు.
ఫ్యామిలీలోని అన్ని వర్గాలకు లభించే విధంగా వస్ర్త, ఆభరణాలు సీఎంఆర్ షాపింగ్‌మాల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అన్నివర్గాల ప్రజలకు నచ్చే విధంగా సరసమైన ధరలకు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. స్వతహాగా మ్యాన్‌ప్యాక్చరింగ్ చేస్తూ, వస్ర్తాలను అందిస్తున్నారు. రూ. 99 నుంచి రూ. 32 వేల వరకు వస్ర్తాభరణాలు లభ్యమవుతున్నాయి. పుట్టిన శిశువు నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు, అదే విధంగా యువతీ, యువకులు, అందరికీ నచ్చే, మెచ్చే ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. సీజనల్ వారీగా నూతన ఉత్పత్తులను అందిస్తున్నారు.
కస్టమర్లకు సేవలు అందించడంలోను, కొనుగోలుదారుల మన్ననలు పొందడంలో అత్యున్నత స్థానంలో ఉంది. రివ్యూలు, మెసేజ్‌లు, ఫీల్‌గుడ్ అందించడంలో 4.8 రేటింగ్‌తో ముం దంజలో ఉంది. నగరం చుట్టూ విస్తరించి ఉన్న సీఎంఆర్ షాపింగ్‌మాల్‌కు నిత్యం వచ్చే కస్టమర్లతో కళకళలాడుతుంది. ఒక్కసారి షాపింగ్ చేసిన కస్టమర్ తిరిగి ఇదే షాపింగ్‌కు వస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. పదివేల మందికి పైగా సిబ్బందికి ఉపాధిని కల్పిస్తూ, నిరంతరం ఆధునికతను కొనసాగిస్తుంది.
కరీంనగర్, మేడ్చల్, మియాపూర్, జూబ్లీహిల్స్, సంగారెడ్డి, నిజామాబాద్‌లో కొత్తగా బ్రాంచ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉప్పల్, హయత్‌నగర్, బీహెచ్ఈఎల్, షాద్‌నగర్, ఖమ్మం, హనుమకొండ, కొత్తగూడెం, మిర్యాలగూడ, సూర్యాపేటతోపాటు, ఏపీలోని 31 ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు.