వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకుపైగా ఉన్న యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూలిప్)ల మెచ్యూరిటీలపట్ల గత బడ్జెట్ ప్రతిపాదించిన పన్ను మినహాయింపులపై ఎట్టకేలకు సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 10(10డీ) ప్రకారం ఫిబ్రవరి 1, 2021 తర్వాత కొనుగోలు చేసిన యూలిప్ పాలసీలపై పన్ను మినహాయింపులను తొలగించారు. ఒకటికన్నా ఎక్కువ యూలిప్ల వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు ఉన్నాసరే ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే ఫిబ్రవరి 1, 2021కి ముందు తీసుకున్న పాలసీల రెన్యువల్ ప్రీమియంలు రూ.2.5 లక్షలు దాటినా వాటికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అంటే కొత్తగా తీసుకున్న యూలిప్ పాలసీ వార్షిక ప్రీమియంలు రూ.2.5 లక్షలు దాటితే పన్నులు తప్పవన్నమాట.