చెన్నై, అక్టోబర్ 3: సిట్రాయిన్ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘న్యూ ఎయిర్‌క్రాస్ ఎక్స్’ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.8.29 లక్షలుగా నిర్ణయించింది. ప్లస్ మాడల్ రూ.9.77 లక్షల నుంచి రూ.11.37 లక్షల లోపు లభించనుండగా, మ్యాక్స్ మాడల్ రూ.12.34 లక్షల నుంచి రూ.13.49 లక్షల లోపు లభించనున్నది.
స్మార్ట్, ప్రీమియం లుక్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్ లెదర్ సీట్లు, 10.25 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 ఇంచుల డిజిటల్ క్లస్టర్, భద్రత ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగం గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌తోపాటు మరో 40 భద్రత ఫీచర్లు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద, కంపెనీ వెబ్సైట్ ద్వారా ఈ మాడల్‌ను బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది.