Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా (Citroen India) దేశీయ మార్కెట్లో శుక్రవారం ఎస్యూవీ కూపే బసాల్ట్ (Basalt) కారు ఆవిష్కరించింది. ఈ కారు ఇంట్రడ్యూసరీ ధర రూ.7.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. నూతన ఇంట్రడ్యూసరీ ధరలు వచ్చే అక్టోబర్ 31 వరకూ డెలివరీతోపాటు బుకింగ్స్ చేసుకునే వారికి వర్తిస్తాయి. సిట్రోన్ డీలర్ల వద్ద ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.11,001 టోకెన్ సొమ్ము చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ ఔట్ లెట్ల వద్ద ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
వచ్చేనెల రెండో తేదీన టాటా మోటార్స్ (Tata Motors) ఆవిష్కరించనున్న కూపే ఎస్యూవీ టాటా కర్వ్ (Tata Currv) కారుకు గట్టి పోటీ ఇవ్వనున్నదీ సిట్రోన్ బసాల్ట్. కూపే ఎస్యూవీ వేరియంట్ గా వస్తున్న తొలి ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) కారుగా సిట్రోన్ బసాల్ట్ నిలుస్తుంది. టాటా మోటార్స్ తన టాటా కర్వ్ కారును ఎలక్ట్రిక్ అవతార్ లోనూ ఆవిష్కరించనున్నది.
2021లో భారత్ మార్కెట్లోకి ఎంటరైనప్పటి నుంచి సిట్రోన్ ఆవిష్కరిస్తున్న ఐదో కారు సిట్రోన్ బసాల్ట్. ఇంతకుముందు సీ5 ఎయిర్ క్రాస్, సీ3, ఈ-సీ3, సీ3 ఎయిర్ క్రాస్ కార్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది సిట్రోన్. సిట్రోన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో వస్తోంది. 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్పీ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 1.2 లీటర్ల త్రీ సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తోనూ వస్తోంది.
టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 109 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ 190 ఎన్ఎం టార్క్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వర్షన్ 205 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సిట్రోన్ తన బసాల్ట్ 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోడల్ లీటర్ పెట్రోల్ మీద 18 కి.మీ, 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ వేరియంట్ 19.5 కి.మీ, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 18.7 కి.మీ మైలేజీ అందిస్తుంది.
సిట్రోన్ బసాల్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 1–అంగుళాల అల్లాయ్ వీల్స్, రాప్ అరౌండ్ టెయిల్ లైట్స్, రేర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ థై సపోర్ట్ ఫర్ ది సెకండ్ రో, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తోంది.
సేఫ్టీ కోసం సిట్రోన్ బసాల్ట్ కారులో ప్రామాణికంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్సీ, రేర్ పార్కింగ్ వ్యూ విత్ పార్కింగ్ సెన్సర్లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ఉంటాయి. ఐదు మోనోటోన్ రంగులతోపాటు ఏడు రంగుల్లో బసాల్ట్ కూపే ఎస్ యూవీ లభిస్తుంది. పొలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ రంగులతోపాటు పొలార్ వైట్ విత్ గ్రే రూఫ్, గార్నెట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ డ్యుయల్ టోన్ ఆప్షన్లలో లభిస్తుంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ తదితర కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది సిట్రోన్ బసాల్ట్.