హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్యాకేజింగ్ రంగం పురోగతి, భవిష్యత్తు అవసరాలపై ప్యాకాన్-2024 పేరుతో ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించబోతున్నట్లు సీఐఐ తెలంగాణ ప్రకటించింది. రేపటి ప్రపంచ మార్కెట్ సవాళ్ల కోసం నేటి ఆవిష్కరణలు’ అనే థీమ్‌తో ఏర్పాటుచేస్తున్న ఈ సదస్సుకు ఆ రంగానికి చెందిన నిపుణులు, ఆవిష్కర్తలు, వాటాదారులు..
పెరుగుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన నూతన ఆవిష్కరణలపై చర్చించనున్నట్లు సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి డీ ప్రసాద్ తెలిపారు. సుమారు 200మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ప్యాకేజింగ్ రంగానికి చెందిన ఉత్పత్తులను కూడా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.