హైదరాబాద్, జనవరి 2: అమెరికాకు చెందిన కస్టమర్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ సేవల సంస్థ సియారా..హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్(జీఐసీ)ని ప్రారంభించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జీఐసీ సెంటర్ ప్రపంచంలో అతిపెద్దది కావడం విశేషం. ప్రస్తుతం ఈ సెంటర్లో 100 మంది వరకు ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తుండగా, వచ్చే రెండు నెలలో ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్లు కంపెనీ సీఈవో రిషీ రానా తెలిపారు.
భవిష్యత్తులో ఈ సంఖ్యను 500కి పెంచుకునే అవకాశం కూడా ఉందన్నారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు భేష్గ్గావున్నాయని, దీంతో అంతర్జాటీ టెక్నాలజీ సంస్థలు ఇక్కడ జీఐసీలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ ఆదాయం వచ్చే రెండేండ్లలో 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.