Yamaha FZ-X Chrome Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్.. దేశీయ మార్కెట్లోకి తన క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ కలర్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ షో-2024లో దీన్ని ఆవిష్కరించారు.
ట్రాక్షన్ కంట్రోల్ తరహా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. న్యూ కలర్ ఆప్షన్ మినహా బైక్ డిజైన్, ఫీచర్లు, డైమన్షన్లలో ఎటువంటి తేడాలు లేవు. క్రోమ్ మోడల్ యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ బైక్.. మ్యాట్టె టైటాన్, డార్క్ మ్యాట్టె బ్లూ, మెటాలిక్ బ్లాక్, మ్యాట్టె కాపర్ కలర్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. ఎఫ్ జడ్-ఎక్స్ క్రోమ్ కలర్ బైక్‌ను తొలుత ఆన్లైన్లో బుక్ చేసుకున్న 100 మంది కస్టమర్లకు డెలివరీ టైంలో ‘కాషియో జీ-షాక్ వాచ్’ ఉచితంగా అందజేస్తారు. యమహా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రూ.2000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. స్టాక్ లభ్యత ఆధారంగా మోటారు సైకిళ్లు 45 రోజుల్లోపు డెలివరీ చేస్తామని యమహా తెలిపింది.
యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ మోటారు సైకిల్ 149సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7250 ఆర్పీఎం వద్ద 12.5 పీఎస్ విద్యుత్, 5500 ఆర్పీఎం వద్ద 13.3 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఫ్రంట్‌లో ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యుయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి.
2024 యమహా ఎఫ్‌జడ్-ఎక్స్ డీలక్స్ మోటారు సైకిళ్లతోపాటు వై-కనెక్ట్ యాప్ అందజేస్తారు. బైక్‌తోపాటు వచ్చే ఈ యాప్‌తో ఫోన్‌ను అనుసంధానించొచ్చు. దీనివల్ల బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌పై ఫోన్ నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. దీంతోపాటు కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, యాప్ కనెక్టివిటీ స్టేటస్, ఫోన్ బ్యాటరీ లెవల్ స్టేటస్ ఉంటాయి. ఫ్యుయల్ కన్జప్సన్ ట్రాకర్, మెయింటెనెన్స్ రికమండేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ మాల్ఫంక్షన్ నోటిఫికేషన్, రివర్స్ డాష్ బోర్డు, ర్యాంకింగ్ తదితర ఫీచర్లు ఉంటాయి.