న్యూఢిల్లీ, మే 24: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షియోమీ మరో అడుగుముందుకేసింది. ఇప్పటికే తన తొలి మాడల్‌కు విశేష స్పందన లభిస్తున్న ప్రస్తుత తరుణంలో మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైయూ7 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో గరిష్ఠంగా 835 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. టెస్లాకు చెందిన వై మాడల్‌కు పోటీగా ఈ కారును ప్రవేశపెట్టింది. ఇప్పటికే విడుదల చేసిన ఎస్‌యూ7 సెడాన్ 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.