కొవిడ్ కారణంగా పిల్లలు ఆరుబయట ఆడుకోవడమే తగ్గిపోయింది. ఎక్కువగా సెల్ఫోన్లు, టీవీలకే అతుక్కుపోవాల్సి వస్తున్నది. ఫలితంగా వారిని అనారోగ్యం వెంటాడుతున్నది. దీనికి ‘ప్లేహౌస్’ మంచి పరిష్కారం. సంపన్నుల ఇండ్లలో చిన్నారుల కోసం ‘ప్లేహౌస్’లు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇందుకోసం కొందరైతే లక్షల రూపాయలు కూడా ఖర్చుచేస్తుంటారు. గార్డెన్లు, టెర్రస్‌లపై విలాసవంతమైన ప్లే
హౌస్‌లు నిర్మిస్తారు. మరి అపార్ట్మెంట్లలో ఉండే మధ్యతరగతి వారికి ఇలాంటి వెసులుబాటు లేదు కదా! దీనికి పరిష్కారంగా వచ్చిందే ‘బెడ్ ప్లేహౌస్’. చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బెడ్ ఇది. ఇందులో ఒకవైపు బెడ్.. మరోవైపు ప్లేహౌస్ ఉంటాయి. సాధారణ ప్లేహౌస్తో పోలిస్తే దీని ధర తక్కువే. పిల్లలు పెద్దయ్యాక, దీన్ని సాధారణ బెడ్‌లా ఉపయోగించుకొనే అవకాశమూ ఉంటుంది.