Meat Venture | ఆకాశ్ మస్కే.. ఆదిత్య కిర్తనే.. వాళ్లిద్దరూ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణ బాల్య స్నేహితులు.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ వారి జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. తొలి నెల లాక్డౌన్ అంతా సినిమాలు వీక్షిస్తూ కాలం గడిపారు ఆకాశ్.. ఆదిత్య.. కానీ ఆంక్షలు కొనసాగడంతో వారి ఉద్యోగాలు పోయాయి. అంటే యాజమాన్యాలు నష్టాలను తగ్గించుకునేందుకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించాయి (కరోనా టైంలో ఇలాంటివెన్నో జరిగాయి).
కానీ, వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి బదులు ఔరంగాబాద్‌లోని కొంత పారిశ్రామిక కార్యకలాపాలు జరుగుతున్న వేళ.. సొంతంగా ఏదైనా చేయాలనుకున్నారు. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ కావాలంటే ఏం చేయాలన్న విషయమపై పుస్తకాలు చదివి తమ నిర్ణయంగా ధృడంగా మార్చేసుకున్నారు గానీ.. అసలేం చేయాలన్నది వారికి అప్పటికి తెలియది. స్థానిక యూనివర్సిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్‌పై ఒకేషనల్ ట్రైనింగ్ కోర్సు అందిస్తున్నది.
అప్పటికే అసంఘటిత రంగంలో ఉన్న మాంసం మార్కెట్ నుంచి రిటైల్ కస్టమర్లకు క్రెడిబుల్ ఆఫర్లు అందించేందుకు ఆదిత్య, ఆకాశ్ల్లో బిజినెస్ ఐడియా పుట్టుకొచ్చింది. అసాధారణమైన ఈ ఆలోచన వచ్చిన వీరిద్దరికి కుటుంబాలు పూర్తిస్థాయిలో మద్దతిచ్చేందుకు తొలుత ముందుకు రాలేదు. తాము చేసే బిజినెస్ వల్ల పెండ్లిండ్లు కాబోవన్న భయంతోనే తమ కుటుంబాలు వెనుకంజ వేశాయని, కానీ.. వారంతా తమకు అండగా నిలిచారని ఆదిత్య కీర్తనే చెప్పాడు.
100 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.25 వేల స్నేహితుల పొదుపే పెట్టుబడిగా `అపెటిటీ` అనే స్టార్టప్ వెంచర్ ప్రారంభించారు. ఇప్పుడది ప్రతి నెల రూ.4 లక్షల టర్నోవర్‌తో నడుస్తున్నది. బిజినెస్ పుంజుకున్నా సిటీలో మరో కంపెనీ ఫాబీ కార్పొరేషన్.. అపిటిటీలో మెజారిటీ వాటాను రూ.10 కోట్లకు ఇటీవల కొనుగోలు చేసింది. ఇందులో మైనారిటీ వాటాలతో సహ-వ్యవస్థాపకులు కీర్తనే, మాస్కే కొనసాగుతారు.
ఔరంగాబాద్‌లో అసంఘటిత రంగంలో కొనసాగుతున్న మీట్ మార్కెట్‌తోపాటు కొత్తగా అపిటిటీ స్టార్టప్ ద్వారా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడతాం అని ఫాబీ డైరెక్టర్ ఫహద్ సయ్యద్ తెలిపారు. పెట్టుబడులు తేవడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడేండ్లలో 100 షాప్‌లు పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తారన్నారు. ఇండ్ల వద్దకు మాంసం సరఫరాకు ఎలక్ట్రిక్ వాహనాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఔరంగాబాద్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఫాబీ డైరెక్టర్ సయ్యద్ చెప్పారు. ఔరంగాబాద్ నుంచి మహారాష్ట్రలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు తమ బిజినెస్ విస్తరిస్తామని వెల్లడించారు.