Bajaj Chetak | పూణె, డిసెంబర్ 20: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..చేతక్ బ్రాండ్‌లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 సిరీస్‌లో భాగంగా సంస్థ విడుదల చేసిన స్కూటర్లు మూడు రకాలు 3501, 3502, 3503గా లభించనున్నాయి. తొలి రెండు స్కూటర్ల ధర వరుసగా రూ.1.27 లక్షలు, రూ.1.20 లక్షలుగా నిర్ణయించిన సంస్థ, మూడో మాడల్ ధరను ప్రకటించలేదు.
ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి. వీటిలో 3501 రకం ఈ నెల చివరి నుంచి, మరో రకం 3502 మాడల్ వచ్చే నెల నుంచి డెలివరీ చేయనున్నట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. వచ్చే ఏడాది ఈ-స్కూటర్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసేయోచనలో సంస్థ ఉన్నట్లు చెప్పారు. ఈ-స్కూటర్ విభాగంలో సంస్థకు 27.6 శాతం వాటా ఉన్నది.