e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home News Cheque Books | అక్టోబ‌ర్ నుంచి ఈ రెండు బ్యాంకుల చెక్‌లు చెల్ల‌వ్‌.. ఎందుకంటే?!

Cheque Books | అక్టోబ‌ర్ నుంచి ఈ రెండు బ్యాంకుల చెక్‌లు చెల్ల‌వ్‌.. ఎందుకంటే?!

Cheque Books | మీకు ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్ (ఓబీసీ)లో గానీ.. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో గానీ ఖాతా ఉందా.. వెంట‌నే మీ బ్యాంకు శాఖ‌ల‌ను సంప్ర‌దించి చెక్‌బుక్‌లు, ఏటీఎం కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ఎందుకంటే వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన చెక్‌బుక్‌లు చెల్ల‌వ‌ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులు వారి పాత చెక్‌బుక్‌ల‌ను ఇచ్చేసి పీఎన్బీ చెక్‌బుక్ తీసుకోవాల‌ని సూచించింది. ఆయా చెక్‌బుక్‌ల్లో పీఎన్బీ ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్‌లు అప్‌డేట్ చేసిన‌ట్లు పీఎన్బీ ట్వీట్‌లో తెలిపింది.

ఖాతాదారుల స‌మాచారం కోసం టోల్ ఫ్రీ నంబ‌ర్‌

- Advertisement -

అప్‌డేటెడ్ చెక్‌బుక్‌లు వాడ‌ని ఖాతాదారులు అసౌక‌ర్యానికి గుర‌వుతార‌ని పేర్కొంది. ఖాతాదారులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం 1800-180-2222 అనే టోల్ ఫ్రీ నంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌ని సూచించింది. చెక్‌బుక్‌తోపాటు ఏటీఎం, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, పీఎన్బీ వ‌న్‌, కాల్ సెంట‌ర్ స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఖాతాదారులు త‌మ స‌మీప బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించాల‌ని పేర్కొంది.

2020 ఏప్రిల్‌లో పీఎన్బీలో ఈ బ్యాంకుల విలీనం

2020 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అయ్యాయి. పండుగ‌ల సీజ‌న్ ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో అన్ని ర‌కాల రిటైల్ ప్రొడ‌క్టుల‌పై స‌ర్వీస్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. 6.8 శాతంపై ఇంటి రుణాలు, 7.15 శాతంపై కార్ల రుణాలు అంద‌చేస్తున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి

IT Returns | బిగ్‌ రిలీఫ్‌.. ఐటీ రిట‌ర్న్స్ గ‌డువు పొడిగించిన కేంద్రం

RBI rule on ATM | గ్రామీణుల‌కు షాక్‌.. ఏటీఎంలు ఎత్తేస్తున్న‌ బ్యాంకులు?!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement