పకడ్బందీగా పాస్వర్డ్
పాస్వర్డ్లు అనేవి ఎంతో కీలకం. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అలాంటి ఈ పాస్‌వర్డ్‌ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ నష్టాలు తప్పవు. అందుకే పాస్‌వర్డ్‌ల నిర్మాణం, దాని భద్రత అంశంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో చూస్తే..
- ఆర్థిక మోసాలకు చెక్ పెట్టండిలా
పాస్వర్డ్లు అనేవి ఎంతో కీలకం. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అలాంటి ఈ పాస్‌వర్డ్‌ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ నష్టాలు తప్పవు. అందుకే పాస్‌వర్డ్‌ల నిర్మాణం, దాని భద్రత అంశంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో చూస్తే..
- మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు చెప్పాల్సి వస్తే.. సదరు లావాదేవీ పూర్తయిన వెంటనే కొత్త పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి.
- అత్యంత క్లిష్టతరంగా, ఎవరి ఊహలకు అందనివిధంగా ఈ పాస్‌వర్డ్‌ల నిర్మాణం ఉంటే మంచిది. డిక్షనరీ వర్డ్స్‌ను వాడటం వల్ల పాస్‌వర్డ్‌లను సైబర్ మోసగాళ్లు ఊహించే వీలున్నది.
- మాతృ భాషకు చెందిన అక్షరాలు లేదా మీకు మాత్రమే తెలిసిన తేదీలు, రకరకాల చిహ్నాలను పెట్టుకోవాలి. అప్పుడే డీ కోడింగ్‌కు కష్టమవుతుంది.
- ప్రతీ 3 లేదా 6 నెలలకోసారి పాస్‌వర్డ్‌లను మారిస్తే ఉత్తమం. సుదీర్ఘకాలంపాటు ఒకే పాస్‌వర్డ్‌ను వాడటం వల్ల సైబర్ మోసగాళ్లబారినపడే ప్రమాదం పొంచి ఉంటుంది.
- కనీసం 16 అక్షరాలతో పాస్వర్డ్ ఉండాలి. పాస్వర్డ్ ఎంత పెద్దదైతే దాన్ని కనిపెట్టడం మోసగాళ్లకు అంత కఠినమవుతుందనే విషయం గుర్తుంచుకోండి.
- ఉచిత వైఫైలను వాడరాదు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, హోటళ్లలో ఫ్రీగా వస్తుందని ఉపయోగిస్తే మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇతరులకు తెలిసే వీలున్నది. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలను అస్సలు జరుపవద్దు. పిన్ నెంబర్లను హ్యాకర్స్ సులభంగా పసిగట్టగలరు.
- పాస్‌వర్డ్‌లను మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోవద్దు. ఫోన్ హ్యాక్ అయినప్పుడు అందులోని విలువైన డాటా కూడా దొంగతనానికి గురవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

