అదానీ ఎయిర్పోర్ట్స్పై విమానయాన సంస్థలు గుస్సా
ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ చార్జీల భారీ పెంపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ విమానయాన కంపెనీలు ఫిర్యాదు చేశాయి.
- క్రికెట్ కప్ పేరుతో చార్టర్డ్ ఫ్లైట్స్ చార్జీల పెంపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ చార్జీల భారీ పెంపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ విమానయాన కంపెనీలు ఫిర్యాదు చేశాయి. అదానీ గ్రూప్ నిర్వహణలోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే చార్టర్డ్ ఫ్లైట్స్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలను హఠాత్తుగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ చార్జీలను 10 రెట్లు పెంచేసినట్టు ఎయిర్‌లైన్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై అందిన ఫిర్యాదులపై ఎయిర్పోర్ట్ ఎకానమీ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) స్పందిస్తూ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ఈ వివాదాన్ని నేరుగా పరిష్కరించేందుకు తమతో తక్షణమే సమావేశమవ్వాలని ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నిర్వహణా సంస్థలూ తన అనుమతి లేకుండా చార్జీలు పెంచరాదన్నది.
- సెప్టెంబర్‌లోనే టారీఫ్ లిస్ట్ విడుదల
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత చార్జీల పెంపుపై టారీఫ్ లిస్ట్‌ను సెప్టెంబర్‌లోనే విడుదల చేసింది. 15 మందికిపైగా ప్రయాణీకులతో కూడిన చార్టర్డ్ ఫ్లైట్స్‌కు కనీసం రూ.2,65,000 జనరల్ ఏవియేషన్ చార్జీలను, ఇందుకు అదనంగా 15 మంది తర్వాత ప్రతీ ఒక్క ప్రయాణీకుడికి రూ.17,667 చొప్పున చార్జీ విధించింది. గత ఐపీఎల్ సందర్భంగా పాసింజర్‌కు రూ.6,000 చొప్పున వసూలు చేసిన అనుబంధ చార్జీలను కూడా తాజా చార్జీలకు కలిపింది. ఈ చార్జీలన్నీ ల్యాండింగ్, పార్కింగ్ ఫీజులకు అదనం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

