ముంబై, ఏప్రిల్ 22: రిస్క్ మేనేజ్మెంట్ను బలోపేతం చేయడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, నిరంతర మార్కెట్ నిఘా ద్వారా ఆర్థిక విపణి రూపురేఖల్ని మార్చడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్) 25వ వార్షికోత్సవంలో శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ‘విస్తృత రీతిలో ఉన్న గత లావాదేవీలు, కస్టమర్ల వ్యవహార శైలి, మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి ఏఐతో ముప్పును అంచనా వేయగలం’ అన్నారు.