హైదరాబాద్, జూన్ 26: ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిలో సీఎఫ్‌వోలు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఐటీ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సీఎఫ్‌వోల కాన్క్ల్లేవ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెట్టుబడులపై రాయితీలు అత్యధికంగా అందిస్తుండటంతో భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయన్నారు. ఆర్థిక రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతున్న తరుణంలో సీఎఫ్‌వోల కీలకపాత్ర పోషించాలని సీఐఐ తెలంగాణ కన్వీనర్ ఎంవీ నరసింహాన్ తెలిపారు.