Apple – CERT-In | ఆపిల్ ఐఫోన్, ఐపాడ్, మ్యాక్‌లు వాడే వారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ అనుబంధ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది. అనుమతుల్లేకుండా ఫోన్లలోకి హ్యాకర్లు చొరబడి డేటా చోరీ చేయడంతోపాటు ఆ ఫోన్లు నియంత్రణలోకి తీసుకునే ముప్పు ఉందని తెలిపింది. ‘ఆపిల్ ఉత్పత్తుల్లో రెండు రకాల బలహీనతలు గుర్తించాం. వాటిని సైబర్ అటాకర్లు వాడుకుని ఎక్స్ఎస్ఎస్ దాడులు చేసే అవకాశం ఉంది.
ఆపిల్ ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్ఎస్ల్లో 18.1.1 ముందు వర్షన్లు, ఆపిల్ ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్‌ల్లో 17.7.2 ముందు వర్షన్లు, ఆపిల్ మ్యాక్ ఓఎస్ సుక్వోయా 15.1.1 ముందు వర్షన్లు, ఆపిల్ విజన్ ఓఎస్ 2.1.1 ముందు వర్షన్, ఆపిల్ సఫారీ 18.1.1 ముందు వెర్షన్ వాడే వారు అప్రమత్తంగా ఉండాలని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. ఈ వర్షన్ల యూజర్లు తమ ఆపిల్ డివైజ్‌ల్లో సెక్యూరిటీ అప్ డేట్లకు అనుకూలంగా చర్యలు తీసుకోవడంతోపాటు సరికొత్తగా సాఫ్ట్ వేర్ వర్షన్లు ఇన్ స్టాల్ చేసుకోవాలని తెలిపింది. ఇటీవలి కాలంలో ఆపిల్ ఫోన్లు, ఇతర డివైజ్‌ల్లో భద్రతపై సెర్ట్-ఇన్ తరుచుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. గత ఏప్రిల్ నెలలోనూ ఇవే హెచ్చరికలు జారీ చేసింది.