Apple- Cert-in | ఆపిల్ ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తుల యూజర్లను కేంద్రం హెచ్చరించింది. వాటితో హై రిస్క్ ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆపిల్ ఉత్పత్తుల యూజర్లను కేంద్ర ప్రభుత్వ అనుబంధ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) అలర్ట్ జారీ చేసింది. పలు ఆపిల్ ఉత్పత్తుల్లో పలు భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని, దీంతో హై రిస్క్ ముప్పు పొంచి ఉందని పేర్కొంటూ సెర్ట్ -ఇన్ ఈ నెల 19న అడ్వైజరీ జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్, మాక్ ఓఎస్, వాచ్ ఓఎస్, విజన్ ఓఎస్ వర్షన్లలో లోపాలు ఉన్నాయని తెలిపింది. కనుక ఆపిల్ ఉత్పత్తుల యూజర్లు ముప్పును తప్పించుకునేందుకు తాజా ఓఎస్ వర్షన్లతో అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. తమ డివైజ్ లపై అన్ యూజువల్ యాక్టివిటీని పర్యవేక్షించాలని పేర్కొంది.
ఐఓఎస్: 18, 17.7లకు ముందు ఐఓఎస్ వర్షన్లు
ఐపాడ్ ఓఎస్ : 18, 17.7లకు ముందు ఐఓఎస్ వర్షన్లు
మాక్ ఓఎస్ సొనోమా : 14.7కి ముందు వర్షన్లు
మాక్ ఓఎస్ వెంచురా: 13.7 కి ముందు వర్షన్లు
మాక్ ఓఎస్ సీక్యూయా : 15కి ముందు వర్షన్లు
టీవీ ఓఎస్: 18కి ముందు వర్షన్లు
వాచ్ ఓఎస్ : 11కి ముందు వర్షన్లు
సఫారీ : 16కి ముందు వర్షన్లు
ఎక్స్ కోడ్ – 16కి ముందు వర్షన్లు
విజన్ ఓఎస్ : 12కి ముందు వర్షన్లు
యూజర్ల సున్నిత సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు అనధికారికంగా యాక్సెస్ చేసుకునే అవకాశం
డివైజ్ మీద ఆర్బిటరీ కోడ్ అమలు
కీలక భద్రతా ఆంక్షలను బైపాస్ చేసే అవకాశం
క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ దాడుల్లో నిమగ్నం
స్పూఫింగ్ దాడుల నిర్వహణ
సిస్టమ్ మీద నియంత్రణకు ప్రివిలేజెస్ ఎలివేట్ చేయడం
18, 17.7 కి ముందు ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్ వర్షన్లపై ‘డినైల్ ఆఫ్ సర్వీస్ కండీషన్ (డీఓఎస్)’ దాడులు, సమాచారం బహిర్గతం, సెక్యూరిటీ ఆంక్షల బైపాసింగ్.
మాక్ ఓఎస్ (సొనోమా, వెంచురా, సీక్యూయా) : మాక్ ఓఎస్ పాత వర్షన్లు వాడే యూజర్లకు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ప్రివిలేజ్ ఎలివేషన్, డీఓఎస్, డేటా మానిప్యూలేషన్ జరిగే ముప్పు.
టీవీఓఎస్ అండ్ వాచ్ ఓఎస్: డీవోఎస్ దాడులు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ (ఎక్స్ఎస్ఎస్) దాడులు, సమాచారం బహిర్గతం చాన్స్.
సఫారీ, ఎక్స్ కోడ్: పాత వర్షన్లపై స్పూఫింగ్, సెక్యూరిటీ ఆంక్షల బైపాసింగ్ ముప్పు.
విజన్ ఓఎస్: డేటా మానిపులేషన్ ముప్పు, డీఓఎస్ దాడులు, సమాచారం బహిర్గతం ముప్పు చాన్స్.