న్యూఢిల్లీ, జూన్ 2: కేంద్ర ప్రభు త్వం 29 మంది నాన్-అఫీషియల్ సభ్యులతో ట్రేడ్ బోర్డును ప్రకటించింది. ఈ బోర్డులో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, యాపిల్ ఇండియా ఎండీ విరాట్ భాఠియా, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ అనీష్ షా సభ్యులతో నియమించిన ట్రేడ్ బోర్డు చైర్‌పర్సన్‌గా వాణిజ్య, పారిశ్రామిక శాఖల మంత్రి వ్యవహరించనున్నారు.
ఈ బోర్డు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థల నుంచి ఉన్నతాధికారులు సంయుక్తంగా ఏర్పాటైన ఈ ట్రేడ్ బాడీ..దేశీయ తయారీ రంగానికి, ఎగుమతులకు మరింత బూస్ట్ నివ్వడానికి పలు చర్యలు సూచించనున్నా. 2019లో ఈ ట్రేడ్ బాడీని కేంద్ర ప్రభుత్వం కౌన్సిల్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్లో విలీనం చేసింది.