e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home బిజినెస్ అకౌంట్‌ అగ్రిగేటర్లు.. భళా

అకౌంట్‌ అగ్రిగేటర్లు.. భళా

ఇటీవలే అకౌంట్‌ అగ్రిగేటర్‌ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఫైనాన్షియల్‌ డాటా షేరింగ్‌ వ్యవస్థకు రంగం సిద్ధమైంది. ఫలితంగా వినియోగదారులు.. ఇక నుంచి అనేక సంస్థలకు రుణాలు, పెట్టుబడుల కోసం డిజిటల్‌గా తమ డాటాను షేర్‌ చేసుకునే వీలుంటుంది. తొలుత దేశంలోని ఎనిమిది పెద్ద బ్యాంకులతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతున్నది. దీనివల్ల రుణాల మంజూరు వేగవంతమవడమేగాక, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు చౌకగా మారనున్నాయి.

అకౌంట్‌ అగ్రిగేటర్‌ అంటే?
ఆర్బీఐ నియంత్రణలో నడిచే ఈ వ్యవస్థలో వ్యక్తిగత ఫైనాన్షియల్‌ డాటా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేయడం చాలా తేలిక. అయితే రెండు సంస్థలూ అకౌంట్‌ అగ్రిగేటర్‌ (ఏఏ) నెట్‌వర్క్‌లో ఉండాలి. అయినప్పటికీ వ్యక్తిగత అనుమతి లేకుండా డాటాను షేర్‌ చేయడం కుదరదు.

- Advertisement -

ఎలా సులభం?
అగ్రిగేటర్‌ ద్వారా డాటాను షేర్‌ చేయడం వల్ల ప్రాసెస్‌ సులభం అవుతుంది. అలాగే భౌతికంగా ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు.

ఏమిటి ఉపయోగం?
నిత్య జీవితంలో బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను సమర్పించాలంటే వాటి ఫిజికల్‌ కాపీల మీద సంతకం ఉండాల్సిందే. అలాగే ఏ ఫిజికల్‌ డాక్యుమెంట్‌ మీదనైనా నోటరీ, లేదా స్టాంప్‌ డాక్యుమెంట్ల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిందే. లేదంటే మన పర్సనల్‌ అకౌంట్ల యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను థర్డ్‌ పార్టీకి షేర్‌ చేసి పని చేయించుకోవాల్సి వచ్చేది. అకౌంట్‌ అగ్రిగేటర్‌ వ్యవస్థ ద్వారా ఆ బాధ తప్పుతుంది. మొబైల్‌ ఆధారితంగా ఉండే ఇది సింపుల్‌గా ఉండటంతోపాటు సెక్యూర్డ్‌ కూడా. డిజిటల్‌ డాటాను యాక్సెస్‌ చేయడంతోపాటు షేరింగ్‌ కూడా చాలా సులభం. ఇప్పటికే యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకులు ఈ వ్యవస్థలో భాగమైయ్యాయి. త్వరలోనే ఎస్‌బీఐ, కొటక్‌, ఫెడరల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులు ఇందులో భాగం కానున్నాయి.

ఎలా ఇది విభిన్నం?
ఆధార్‌ కేవైసీ మీ పేరు, అడ్రస్‌, జెండర్‌ తదితర వివరాలు మాత్రమే తెలుపుతుంది. సిబిల్‌ మీ రుణాల హిస్టరీ, క్రెడిట్‌ స్కోర్‌ వంటి సమాచారాన్నే అందిస్తుంది. కానీ అకౌంట్‌ అగ్రిగేటర్‌ నెట్‌వర్క్‌ లావాదేవీల డాటా లేదా సేవింగ్స్‌, డిపాజిట్‌, కరెంట్‌ అకౌంట్స్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను షేర్‌ చేస్తుంది.

ఎలాంటి డాటాను షేర్‌ చేయవచ్చు?
బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతోపాటు, ట్యాక్స్‌, పెన్షన్‌, సెక్యూరిటీస్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ వంటి డాటాలు కూడా షేరింగ్‌ చేయవచ్చు. అలాగే హెల్త్‌కేర్‌, టెలికం డాటానూ త్వరలో అగ్రిగేటర్‌ ద్వారా షేర్‌ చేయడానికి అవకాశం ఉంది.

నమోదు ఎలా?
అకౌంట్‌ అగ్రిగేటర్‌తో నమో దు కావాలంటే వెబ్‌సైట్‌లో లేదా మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వన్‌మనీ, ఫిన్‌వు, కామ్స్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌ఏడిఎల్‌ ప్రస్తుతం ఉన్న అగ్రిగేటర్‌ యాప్‌లు. ఫోన్‌ పే, యాడ్లీ, పెర్‌ఫియోస్‌ అనేవి ఆర్బీఐ అనుమతి పొందాయి. త్వరలోనే సేవలు ప్రారంభించనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement