న్యూఢిల్లీ, మార్చి 15: దేశీయ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. 1.10 లక్షల మంది ఉద్యోగుల 17 శాతం వేతన పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగుల జీతాల పెంచిన కొన్ని రోజుల్లోనే ఎల్ఐసీ సిబ్బంది వేతనాల పెంపునకు అనుమతించడం విశేషం. దీంతో ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు ఆగస్టు 1, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే ఏప్రిల్ 1, 2010 తర్వాత ఎల్ఐసీలో చేరిన 24 వేల మంది ఉద్యోగుల ఎన్పీఎస్ వాటా 10 శాతం నుంచి 14 శాతానికి పెరగనున్నది. వీరితోపాటు 30 వేల మంది పెన్షనర్లకు కూడా ఆర్థిక ప్రయోజనం కలగనున్నది.