న్యూఢిల్లీ, జూన్ 6: వంటనూనెల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వివిధ బ్రాండ్ల ధరలను పోల్చి చూసుకోవడానికి, సరైన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి వినియోగదారులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వంటనూనెల ప్యాకేజింగ్ పరిమాణాన్ని తప్పనిసరిచేసింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటనూనెల కోసం ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను నిర్దేశించింది. నూనెలు, నికర పరిమాణాన్ని నిర్థారించడానికి సంబంధించిన తమ ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్వోపీ) సంబంధిత శాఖ ఈ సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలను పాటించేందుకు తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు మూడు నెలల సమయాన్ని కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
సవరించిన ఎస్వోపీ ప్రకారం తొమ్మిది ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను నిర్దేశించింది. దీంట్లో 200 ఎంఎల్, 500 ఎంఎల్, లీటర్, 2 లీటర్లు, 3 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లలో వంటనూనెలు, పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్, మస్టర్డ్, పల్లీనూనె, రైస్బ్రాండ్, కాటన్సీడ్స్, కార్న్ ఆయిల్ లభించనున్నాయి. దేశంలోని వంటనూనెల రంగంలో దాదాపు 90 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పరిశ్రమల సంఘాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్త నిబంధనల ప్రకారం..వంటనూనె పరిమాణాన్ని ఘనపరిమాణంలో చూపినైట్టెతే..లీటల్ మెట్రాలజీ రూల్స్-2011 ప్రకారం ప్యాకేజీపై బరువును స్పష్టంగా పేర్కొనాలి.
ఈ నూతన నిబంధనలు దేశీయంగా తయారైన వంటనూనెలతోపాటు దిగుమతి చేసుకుంటున్న నూనెలకు వర్తించనున్నది. 200 ఎంఎల్ కంటే తక్కువ స్థాయి సాచెట్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. ఈ సందర్భంగా దేశీయ వంటనూనెల తయారీదారుల సంఘం ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్ మాట్లాడుతూ..ఈ నూతన నిబంధనలను స్వాగతిస్తున్నట్టు, రిటైల్ వ్యవస్థాగత మార్కెట్లో అందరికి సమాన అవకాశాలను కల్పించనున్నట్టు చెప్పారు.
ప్రామాణిక నిర్వహణ విధానం