బ్యూనోస్ ఎయిర్స్, మే 16: గత ఏడాది ప్రపంచ ఫుట్‌బాల్ కప్ గెలిచి సంచలనం సృష్టించిన అర్జెంటీనా తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అర్జెంటీనా తాజాగా కీలక వడ్డీ రేటును ఏకంగా ఆరు శాతం పెంచింది. దీంతో వడ్డీ రేటు 97 శాతానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అర్జెంటీనా సమస్య ప్రత్యేకమైనది.
ఇక్కడ వార్షిక ద్రవ్యోల్బణం రేటు 100 శాతాన్ని మించిపోయింది. ప్రస్తుతం అర్జెంటీనాకు మించిన ద్రవ్యోల్బణం వెనిజులా, జింబాబ్వేల్లో మాత్రమే ఉన్నట్టు ఐఎంఎఫ్ డాటా వెల్లడిస్తున్నది. ఈ దేశపు కరెన్సీ పెసో డాలర్‌తో పోలిస్తే 23 శాతం పడిపోయింది.