న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: సిమెంట్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ఉత్పత్తి సంస్థలు ధరలను 1-3 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేస్తున్నది. అలాగే సిమెంట్‌కు డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరుగొచ్చని వెల్లడించింది.
క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతోపాటు పెట్‌కోక్, విద్యుత్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో సంస్థలు ధరలు పెంచకతప్పదని అభిప్రాయపడింది. గతేడాదితో పోలిస్తే క్రూడాయిల్ ధరలు 46 శాతం పుంజుకోగా, పెట్ కోక్ ధరలు 13 శాతం చొప్పున పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బస్తా సిమెంట్ ధర రూ.355 నుంచి రూ.400 స్థాయిలో ఉన్నది.