హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): అనేక వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే మందుల తయారీకి, పంట లక్షణాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసేందుకు అవసరమైన ప్రొటీన్ల మార్పిడిపై సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు విజయం సాధించారు.
త్రీడీ ఆకారంలో స్థిరంగా ఉండే ప్రొటీన్లు పరిస్థితులకు తగ్గట్టుగా తమ రూపాన్ని తాత్కాలికంగా మార్చుకుని జీవక్రియలు నిర్వహిస్తాయని తేల్చారు. డాక్టర్ మందార్ దేశ్ముఖ్ సారథ్యంలో జరిగిన ఈ పరిశోధన.. వైద్యం, వ్యవసాయం, బయోటెక్నాలజీ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలకు దోహదపడుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.