న్యూఢిల్లీ, జనవరి 20: సీబీఆర్650ఆర్ మాడల్‌కు చెందిన కొన్ని మోటర్‌సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రకటించింది. 2024 డిసెంబర్ 16 నుంచి 2025 మే 4 మధ్య తయారైన సీబీఆర్650ఆర్ బైకులలో తలెత్తిన సమస్యను సరిచేయాలని నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. వాహనదారులు సమీపంలోని హెచ్ఎంఎస్ఐ డీలర్‌షిప్‌ల వద్దకు వెళ్లి, అవసరమైన మార్పులు చేసుకోవాలని కోరింది. ఎలాంటి చార్జీలను వసూలు చేయరన్నది.