Jeep India Discounts | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) భారత్ మార్కెట్లోకి ఎంటరై ఎనిమిదేండ్లవుతున్నది. జీప్ ఇండియా తన ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా రెండు మోడల్ కార్లపై భారీగా ధర తగ్గించేసింది. జీప్ కంపాస్ (Jeep Compass), జీప్ మెరిడియన్ (Jeep Merdian) కార్లపై గరిష్టంగా రూ.2.5 లక్షల వరకూ స్పెషల్ ఫ్రీడం బెనిఫిట్లు ప్రకటించింది. ఆగస్టు నెలాఖరు వరకూ ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. ఎంజీ హెక్టార్, టాటా హారియర్ కార్లకు జీప్ కంపాస్ గట్టి పోటీ ఇస్తున్నది. మరోవైపు ఎంజీ గ్లోస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లకు జీప్ మెరిడియన్ పోటీ ఇస్తోంది.
జీప్ కంపాస్ ధర రూ.18.99 లక్షల నుంచి రూ.32.41 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుండగా, జీప్ మెరిడియన్ రూ.31.23 లక్షల నుంచి రూ.39.83 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. జీప్ ఇండియా తన ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా తన ఎంటైర్ పోర్ట్ ఫోలియో కార్లపై అడిషనల్ ఎక్స్చేంజ్, లాయాల్టీ, కార్పొరేట్ బెనిఫిట్లు ఆఫర్ చేస్తోంది. జీప్ ఇండియా కస్టమర్లు లేబర్, కార్ కేర్ ట్రీట్ మెంట్స్, బాడీ రిపేర్లపై 7.8 శాతం వరకూ సర్వీస్ బెనిఫిట్లు పొందొచ్చు.
– జీప్ కంపాస్ – రూ.2.50 లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్
– జీప్ మెరిడియన్ – రూ.2 లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్లు
– రాంగ్లర్, గ్రాండ్ చెరోకీల్లో సెలెక్టెడ్ వేరియంట్లపై వాకిన్ కస్టమర్లకు ఆఫర్లు
– ఎక్స్చేంజ్, లాయాల్టీ, కార్పొరేట్ బెనిఫిట్లు అదనం