హైదరాబాద్, డిసెంబర్ 20: యూస్డ్ కార్ల విక్రయ సంస్థ కార్స్24..తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా తాజాగా వరంగల్లో అడుగుపెట్టింది. యూవిన్ అటోస్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లు లభించనున్నాయని తెలిపింది. మరింత సులభంగా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే విధంగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్టు కార్స్24 కో-ఫౌండర్ గజేంద్ర జంగడి తెలిపారు.