Cars Sales | కరోనా తర్వాత కార్ల విక్రయాలు పుంజుకున్నా.. తొలిసారి వెనకబడ్డాయి. 2023తో పోలిస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం 2024లో కార్ల విక్రయాలు ఐదు శాతం తగ్గాయి. 2023లో 41.1 లక్షల కార్ల విక్రయాలు నమోదైతే 2024లో 43 లక్షల యూనిట్లకు చేరాయి. 2023తో పోలిస్తే వృద్ధి సాధించినా.. ఎస్యూవీ కార్లకు పెరిగిపోయిన పాపులారిటీ వల్లేనని చెబుతున్నారు. 2024 కార్ల విక్రయాల్లో 54 శాతం విక్రయాలు ఎస్యూవీ కార్లవే. కార్ల విక్రయాలు తగ్గడానికి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఒత్తిళ్లేనని తెలుస్తున్నది. 2024లో కార్లకు గిరాకీ తగ్గడంతో పలు కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయాల పెంపు కోసం డిస్కౌంట్లు, ధరల తగ్గింపు వంటి చర్యలు చేపట్టాయి. ఇటీవలి కాలంలో సేఫ్టీ కోసం కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం కఠినంగా నిర్ణయం అమలు చేయడం వల్ల కార్ల ధరలు పెరిగాయి. తక్కువ ధరకు కార్ల లభ్యత లేకపోవడంతో పట్టణ ప్రాంతాల్లో సేల్స్ గ్రోత్ తగ్గింది.
సవాళ్లతో సతమతం అవుతున్నా 2024లో మారుతి సుజుకి బెస్ట్ సేల్స్ రికార్డు నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి గిరాకీ పెరగడంతో 2024లో 17.4 లక్షల కార్లు విక్రయిస్తే 2024లో 17.9 లక్షల కార్లు విక్రయించింది. ఎస్యూవీలకు పరిమితం కాకుండా అన్ని సెగ్మెంట్లలోనూ గ్రోత్ సాధించడం వల్లే గ్రోత్ సాధించామని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు.
హ్యుండాయ్ మోటార్స్ 2023తో పోలిస్తే ఫ్లాట్ గ్రోత్ నమోదు చేసుకుంది. 2023 కంటే ఒక్క శాతం ఎక్కువ సేల్స్ నమోదు చేసుకున్నది. పరిశ్రమలో సమస్యలు ఉన్నా 2024లో స్థిరంగా కార్ల విక్రయం సాగిందని హ్యుండాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ కం సీఓఓ తరుణ్ గార్గ్ చెప్పారు. ఇక దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వరుసగా నాలుగో ఏడు 2024లో 5.6 లక్షలకు పైగా కార్లు విక్రయించింది. ఎస్యూవీలు, సీఎన్జీ పవర్డ్ కార్లకు పాపులారిటీ పెరగడం వల్లే కార్ల విక్రయంలో గ్రోత్ సాధ్యమైందని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.