ముంబై, నవంబర్ 13: తెలంగాణలోని రంగాపూర్ వద్ద ఉన్న ఆల్కాహాల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ లిమిటెడ్(ఏబీడీ) ప్రకటించింది. ప్రస్తుతం ఈ యూనిట్లో ఏడాదికి 54.75 మిలియన్ లీటర్ల ఆల్కాహాల్ ఉత్పత్తి అవుతుండగా, దీనిని 65 మిలియన్ లీటర్లకు పెంచింది. కంపెనీ అంతర్గత వనరుల ద్వారానే ఈ వ్యాపారాన్ని విస్తరించినట్లు తెలిపింది.రంగాపూర్‌లో 75 ఎకరాల స్థలంలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌తో 400 మందికి ఉపాధి లభిస్తుండగా, పరోక్షంగా లక్ష మంది రైతులకు లబ్దిచేకూరుతున్నదని ఏబీడీ ఎండీ అలోక్ గుప్తా తెలిపారు.